ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ గర్భిణీ స్త్రీ హనుమాన్ చాలీసాను తన కడుపులో ఉన్న బిడ్డకు వినిపించడంతో బిడ్డ రియాక్ట్ అవుతోంది. మొదట ఆమె ఓ సినిమా పాటను ప్లే చేస్తుంది. ఆ పాటకు బిడ్డ ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. తర్వాత ఆమె హనుమాన్ చాలీసా పెట్టగానే ఆ బిడ్డ కదులుతుంది. ఈ వీడియో @SunRaah అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇది చూసిన నెటిజన్లు హనుమాన్ ఆశీస్సులు ఉంటాయని అంటున్నారు.