HYD-మీర్‌పేటలో జరిగిన మహిళ వెంకటమాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మాధవి మిస్సింగ్ కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్య కేసు నమోదు చేశారు. టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకల ఆధారాలను DNA మ్యాచింగ్ కొరకు FSLకు పంపించారు. కొన్ని గంటల్లో పోలీసులకు DNA నివేదిక చేరనుండగా.. గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.