AP: విశాఖ జిల్లా భీమిలి మండలం తగరపువలసలో విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవ పడిన భార్య మాధవి (25) తన ఇద్దరు కుమార్తెలతో పాటు తానూ పురుగుల మంది తాగి ఆత్మహత్యకు యత్నించింది. మాధవి, చిన్న కుమార్తె రతిక్ష మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మాధవి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తుంటాడు.