ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు: మంత్రి పార్థసారథి (వీడియో)

82చూసినవారు
AP: అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక 1.14 లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. గృహ నిర్మాణానికి 6 నెలల్లో రూ.502 కోట్లు ఖర్చు చేశామన్నారు.ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని మంత్రి తెలిపారు. తేతలిలో ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్