చెన్నై వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కి తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. తొలి బంతికే ఫోర్ కొట్టి దూకుడు ప్రదర్శించిన ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 4 పరుగులకే ఔటయ్యాడు. అర్ష్‌దీప్ వేసిన నాలుగో బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన సాల్ట్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.