ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్‌ కోత.. రోగికి సర్జరీ ఆపేసిన వైద్యులు!

53చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్‌ కోత.. రోగికి సర్జరీ ఆపేసిన వైద్యులు!
పంజాబ్‌లోని పాటియాలాలో షాకింగ్ సంఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఒక రోగికి సర్జరీ చేస్తున్నారు. అయితే విద్యుత్‌ కోత కారణంగా ఆపరేషన్ థియేటర్‌లోని ఎమర్జెన్సీ లైట్లు ఆగిపోయాయి. దీంతో ఆ రోగికి శస్త్రచికిత్సను డాక్టర్లు ఆపేశారు. కరెంట్‌ తిరిగి వచ్చే వరకు వైద్యులు వేచి ఉన్నారు. దీని గురించి ఒక డాక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్