ఢిల్లీలో భారీ వర్షం.. 1936 తర్వాత తొలిసారిగా..

64చూసినవారు
ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులను ఇప్పుడు వర్షాలు భయపెడుతున్నాయి. గత రెండ్రోజుల నుంచి ఢిల్లీలో ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. 3గంటల్లోనే 150 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1936 తర్వాత జూన్‌ నెలలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదవ్వడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ పేర్కొంది.

సంబంధిత పోస్ట్