హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, అమీర్ పేట్, గండిపేట్ తదితర ప్రాంతాల్లో ద
ంచి కొడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. అటు ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం, బుక్కపట్నంలో తెల్లవారుజాము నుంచి వర్షం దంచికొడుతోంది. కాగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలిపింది.