భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం విదర్భకు ఆనుకొని ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది. రెండు రోజుల పాటు అక్కడక్కడా అతిభారీ వర్షాలు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.