అసోంలో భారీ వర్షాలు.. ప్రమాదకర స్థాయిలో ‘బ్రహ్మపుత్ర’(వీడియో)

73చూసినవారు
ఈశాన్య రాష్ట్రం అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదల కారణంగా పలుచోట్ల ఇండ్లు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా బ్రహ్మపుత్ర నదికి వరద పెరిగింది. ప్రస్తుతం బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దాంతో నదీ పరివాహన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్