వారికి త్వరలో రూ.15 వేలు పింఛన్: ఏపీ మంత్రి

565చూసినవారు
వారికి త్వరలో రూ.15 వేలు పింఛన్: ఏపీ మంత్రి
మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నవారికి త్వరలో రూ.15 వేలు పింఛన్ అందించే ఆలోచన ఉందని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అందించే కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఖజానాను జగన్ ఖాళీ చేయడమే కాకుండా రూ.12 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన ఉంచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ట్యాగ్స్ :