ఢిల్లీలో కురుస్తోన్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అండర్‌పాస్‌లు, రోడ్లు నీట మునిగి నోయిడా సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో గత దశాబ్దంలో అత్యధిక వర్షపాతం నమోదైందనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న వారం రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.