తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం సిద్దిపేటలో 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలోనూ 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.