మహారాష్ట్రలో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. పూణె, పాల్ఘర్, సతారా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. ఈ మేరకు ఈ మూడు జిల్లాలకు ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై, థానే, రారుగఢ్, రత్నగిరి, సింధుర్గ్, నాసిక్ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.