పన్ను ఎగవేతకు పాల్పడిన అంశంలో దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ Infosysకు ఊరట లభించింది. కర్ణాటక ప్రభుత్వం కంపెనీకి పంపిన రూ.32,403 కోట్ల నోటీసును ఉపసంహరించుకుంది. ఈ సమాచారాన్ని టెక్ దిగ్గజం గురువారం స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పంచుకుంది. బుధవారం నోటీసు జారీ చేసిన తర్వాత గురువారం స్వయంగా కంపెనీ ఓ వివరణ జారీ చేసింది.