ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు గల హెన్రీ అనే మొసలికి 10,000 పిల్లలున్నాయి

72చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు గల హెన్రీ అనే మొసలికి 10,000 పిల్లలున్నాయి
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసు(123 ఏళ్లు) కలిగిన హెన్రీ అనే మొసలికి 10,000 పిల్లలున్నాయి. ఈ మొసలి 16 అడుగుల పొడవు, 700 కిలోలకు పైగా బరువు ఉంటుంది. హెన్రీ ఆరు ఆడ మొసళ్లతో జతకట్టి 10,000 మొసళ్ల జననానికి కారణమైందని జూ అధికారులు తెలిపారు. బోట్స్ వానాలో జన్మించిన హెన్రీని గత 30 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలోని స్కాట్‌బర్గ్‌లో ఉన్న క్రోక్‌వరల్డ్ కన్జర్వేషన్ సెంటర్‌లో ఉంచుతున్నారు. గతంలో ఈ మొసలికి మనుషులను చంపి తినే అలవాటు ఉంది.

సంబంధిత పోస్ట్