'సత్యం.. సుందరం' సినిమా విజయోత్సవ కార్యక్రమం గుంటూరు జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా హీరో కార్తీ సందడి చేశారు. విద్యార్థులతో కలిసి పాటలకు కార్తీ స్టెప్పులేశారు. స్నేహం, మానవ సంబంధాల గురించి తెలిపే తన సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కార్తీ అన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ సినిమా చూడాలని ఆయన కోరారు.