అతిగా ఫోన్ వినియోగిస్తే అధిక రక్త పోటు సమస్య వస్తుందని యూకే పరిశోధకులు వెల్లడించారు. దీనిపై వారు నిర్వహించిన అధ్యయనం 'యూరోపియన్ హార్ట్ జర్నల్-డిజిటల్ హెల్త్'లో ప్రచురించారు. దీని ప్రకారం రోజుకు 6 గంటల కంటే ఎక్కువగా ఫోన్ వినియోగించే వారిలో హైపర్ టెన్షన్ వచ్చే ముప్పు 25 శాతం ఎక్కువ ఉంటుందన్నారు. దీని వల్ల గుండెజబ్బులు, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది.