ఇప్పటికే వరదలు, వర్షాలతో వణికిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి పిడుగులాంటి వార్త చెప్పింది. మళ్లీ భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.