పంట మార్పిడి చేస్తే ఒక పంటపై ఆశించే పురుగు మరో పంటను ఆశించవు. వేగంగా వృద్ధిచెందే కొన్నిరకాల పురుగులు పంట మార్పిడితో అదుపులో పెట్టొచ్చు. వరి, వేరుశనగ, మొక్క, జొన్న తదితర పంటల పైర్లు నేలపై పొరల నుంచి పోషకాలు తీసుకుంటాయి. నేల భౌతిక లక్షణాలు, స్వభావం దెబ్బతినకుండా ఉండేందుకు చీడపీడల అభివృద్ధిని నిరోధించేందుకు పంట మార్పిడి తప్పకుండా చేయాలి. అప్పుడప్పుడు పశుగ్రాసం కోసం గడ్డిజాతి పైర్లు భూసారాన్ని పెంచడానికి పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి.