ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఓ సెంటిమెంట్ రిపీట్ అయినట్లు కనిపిస్తోంది. గతంలో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి జైలుకెళ్లాక ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. ఇక మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గతంలో జైలుకు వెళ్లారు. దీంతో ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. ప్రస్తుత ఫలితాల్లో ఆయన పార్టీ జేఎంఎం, కాంగ్రెస్ కూటమి భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మరోసారి సోరెన్ సీఎం కానున్నారు.