రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఎరువులు, పురుగుల మందులను మోతాదుకు మించనీయవద్దని.. అలా చేస్తే లాభం కంటే నష్టమే అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. చలికాలం రాబోతున్నందున తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు.