పట్టాలు తప్పి నదిలో పడిపోయిన రైలు బోగీలు (Video)

64చూసినవారు
రష్యాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు వోర్కుటా నగరం నుంచి ఆర్కిటిక్‌ సర్కిల్‌ మీదుగా.. దేశంలోని దక్షిణాన నల్ల సముద్రంలోని నోవోరోసిస్క్‌ నౌకాశ్రయానికి వెళ్తోంది. కోమి రిపబ్లిక్‌లోని ఇంటా అనే చిన్న పట్టణం సమీపంలోకి రాగానే రైలు పట్టాలు తప్పింది. దీంతో 9 బోగీలు కోమి నదిలో పడిపోయాయి. ఆ సమయంలో ట్రైన్‌లో 215 మంది ప్రయాణికులున్నారు. వారిలో 70 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్