వరద నీరు చేరిన ఇళ్లు శుభ్రం ఇలా..

58చూసినవారు
వరద నీరు చేరిన ఇళ్లు శుభ్రం ఇలా..
*వరద నీటితో నిండిన ఇళ్లలో నీటిని పూర్తిగా తొలగించిన అనంతరం.. ఇంట్లో ఉపరితలాలను, వస్తువులను, దుస్తులను, వస్త్రాలను, సామగ్రిని గోరు వెచ్చటినీరు, సబ్బుతో కలిపి శుభ్రపర్చాలి.
*అన్ని ఉపరితలాలను, వస్తువులను హైపోక్లోరైట్‌ ద్రావణంతో ఇన్‌ఫెక్షన్‌ రహితంగా చేసుకోవాలి. ఒక లీటరు నీటిలో 50 మి.లీ. హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని కలిపి 15 నిమిషాల అనంతరం వినియోగించాలి.
* శుభ్రపర్చిన వస్తువులను, దుస్తులను సాధ్యమైనంత వరకూ ఎండలోనే ఆరబెట్టాలి.
* చేతులను పదేపదే శుభ్రంగా కడుక్కోవాలి.

సంబంధిత పోస్ట్