స్ట్రెప్టొకొకస్, స్టాఫిలోకొకస్ అనే బ్యాక్టీరియాల వల్ల సెల్యూలైటిస్ వ్యాధి సోకుతుంది. సాధారణంగా మురుగు నీటిలో ఎక్కువసేపు కాళ్లు ఉంచడం ద్వారా.. అపరిశుభ్ర వాతావరణంలో వ్యాపిస్తుంది. గాయాలు ఉన్నవారిలో బ్యాక్టీరియా సులభంగా ప్రవేశిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఫైలేరియా ఉన్నవారిలో ఇది త్వరగా సోకడంతో పాటు వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శరీరంలో కింది భాగాలు.. ప్రధానంగా కాళ్లకు సెల్యులైటిస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.