కూలీ పనికి వెళ్లిన మహిళ.. లక్షాధికారిగా తిరిగొచ్చింది

567చూసినవారు
కూలీ పనికి వెళ్లిన మహిళ.. లక్షాధికారిగా తిరిగొచ్చింది
కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరిలో కూలీ పనికి వెళ్లిన ఓ మహిళకు విలువైన వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని స్థానిక వజ్రాల వ్యాపారస్థుడు రూ.2లక్షల నగదు, తులం బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దాని అసలు ధర ఎంత అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. గత కొన్నిరోజుల నుంచి కురుస్తున్న జల్లులకు జొన్నగిరి, పగిడిరాయి, చెన్నంపల్లి తదితర గ్రామాల్లో ఇప్పటికే వజ్రాలు బయటపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్