ఉక్రెయిన్‌కు చెందిన నటుడు అర్మెన్ అటైన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. టోర్రెస్ జ్యూవెల్లరీ పేరిట ముంబై అంతటా బ్రాంచ్‌లు పెట్టి పెట్టుబడిదారుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన పోంజీ స్కామ్ కేసులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేయగా, సూత్రదారుల ఆచూకీ కోసం వేట కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.