చిరుతను చంపి వండుకొని తిన్న ఘటన ఒడిశా రాష్ట్రం నౌపడా జిల్లా దియోధరా గ్రామంలో జరిగింది. నవంబర్ 15న వేటగాళ్లు గ్రామ సమీపంలోని అడవిలో పందుల కోసం ఉచ్చు వేశారు. అయితే అందులో చిరుత చిక్కుకుంది. దీంతో వేటగాళ్లు చిరుతను చంపేసి దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకొని మిగిలిన చిరుత మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.