గంజాయిపై ఒక్కసారి కూడా రివ్యూ చేయకపోవడం దౌర్భాగ్యం: మంత్రి వంగలపూడి (వీడియో)

70చూసినవారు
AP: గత ప్రభుత్వం గంజాయిపై ఒక్కసారి కూడా రివ్యూ చేయకపోవడం దౌర్భాగ్యమని మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత కాలంలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి ఉండే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో కేవలం రెండే సీసీ కెమెరాలు ఉండేవని.. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పకడ్బందీగా చెక్ పోస్టులు, సీసీ కామెరాలు ఏర్పాటు చేశామని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్