TG: మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఇక నుంచి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఇప్పటికే ఔటర్‌పై ప్రమాదాల విశ్లేషణ, నివారణ చర్య
ల కోసం యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు.