ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్పొరేటర్

83చూసినవారు
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్పొరేటర్
ప్రజలు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలని కాచిగూడ కార్పొరేటర్ కన్నే ఉమా రమేష్ యాదవ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని బర్కత్ పురా బస్టాప్ వద్ద యూపిహెచ్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో కార్పొరేటర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. స్థానిక ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్