గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని కారులో అక్రమంగా రవాణా చేస్తుండగా హయత్ నగర్ లో ఎక్సైజ్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. కారు వెనుక సీటు కింది భాగంలో ప్రత్యేక ర్యాట్ ఏర్పాటు చేసి 14 కేజీల గంజాయి ప్యాకెట్లను పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. కాగా గంజాయి తరలిస్తున్న మోస్ట్ వాంటెడ్ లేడి డాన్ సునిత దాస్ తో పాటు కారు డ్రైవర్ ఇస్తీయా ఖురేషి, కంకం అనే ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.