భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ను అవమానపరిచే విధంగా కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడరంటూ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు అధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని మాట్లాడారు. మంత్రి పదవి నుండి అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు.