వినాయ‌కుడి మండపం వద్ద అగ్ని ప్రమాదం

76చూసినవారు
వినాయ‌కుడి మండపం వద్ద అగ్ని ప్రమాదం
దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని పీఎన్‌టీ కాల‌నీలో శనివారం అన్యుహ ఘటన చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్బంగా పీఎన్‌టీ కాల‌నీలోని ఓ వినాయ‌క మండ‌పాన్ని పూర్తిగా ప‌త్తితో డెకరేషన్ చేశారు. మరి కాసేపట్లో వినాయ‌కుడిని ప్ర‌తిష్టించాల‌ని ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఆ మండ‌పంలో షార్ట్ స‌ర్క్యూట్ సంభ‌వించింది. మెయిన్ స్విచ్ ఆన్ చేయ‌గానే ఒక్కసారిగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. మండపం కాలిపోవడంతో చిన్నారులు కన్నీరు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్