నా 25 ఏళ్ల శ్రమ ఫలించింది

591చూసినవారు
కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఫామ్ తీసుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్లో అందజేశారు. తన 25 ఏళ్ల కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చారని ఆయన చెప్పారు. ఎంపీగా గెలిచి ప్రజా సమస్యలపై పోరాడతానని వెల్లడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు తనకు సంపూర్ణంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్