విద్యార్థులను అభినందించిన కార్పొరేటర్

52చూసినవారు
విద్యార్థులను అభినందించిన కార్పొరేటర్
నల్లకుంట డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో ఉన్న పద్మం కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవికాలం సెలవులలో ఉచిత కరాటే శిక్షణ అందించారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు డివిజన్ బిజెపి కార్పొరేటర్ అమృత సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. హౌసింగ్ బోర్డు సొసైటీ వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్