హైదరాబాద్ శివార్లలో మొదలైన వాన
హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీ, బీహెచ్ఎల్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జోరు వర్షం కురుస్తోంది.