న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండాలని సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పూలబోకెలు, స్వీట్ బాక్సులు, శాలువాలు తీసుకురావోద్దని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు ఆదేశాలు జారీ చేశారు. మన్మోహన్ సింగ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.