శాస్ట్రిపురం డివిజన్ పరిధిలో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బెగ్ అధికారులతో కలిసి శుక్రవారం పర్యటించారు. స్థానికంగా చేపట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై ఎమ్మెల్సీ అరా తీశారు. సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చూడాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అధికారులు పనులను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.