ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ఆవరణలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు, శ్రీ గోదా, రంగనాయక స్వామి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వార్ల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఇంచార్జీ పార్థ సారధి ఒక ప్రకటనలో తెలియజేశారు. సాయంత్రం 7. 30 గంటల నుండి సాయంత్రం పూజ, నివేదన, హారతులు, అర్చనలు మొదలగు కార్యక్రమాలు జరుపనున్నట్లు తెలిపారు.