ఉప్పుగూడ పరిధిలోని అరుంధతి కాలనీలో గురువారం బస్తీ దవాఖానా మరియు బంగారు మైసమ్మ ఆలయ వీధిలో GHMC వారు పాత కాంక్రీటు రోడ్డును తవ్వేసి, డ్రైనేజీ మరమ్మతులు చేసి, కొత్తగా కాంక్రీట్ రోడ్డుని వేశారు. గుంతల రోడ్డుతో బస్తీ దవాఖానాకి వచ్చే రోగులు, బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడే వారని, ఇప్పుడు కాస్త ఉపశమనం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.