ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రముఖ సింగర్ కల్పన సంచలన ఆరోపణలు చేశారు. 'ఆయన నేషనల్ అవార్డు పొందిన యాక్టర్.. బెడ్ రూంలోకి వెళ్లి అరెస్ట్ చేస్తారా? బన్నీకి చెడ్డ పేరు తెచ్చేలా కుట్ర పూరితంగా ఈ కేసులో ఇరికించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఆయనను అరెస్ట్ చేశారు. సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదు' అని కల్పన మండిపడ్డారు.