చాంద్రాయణగుట్ట డివిజన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్ లో పారిశుద్ధ్యం పడకేసింది. గత కొద్ది రోజులుగా చెత్త రోడ్డు పక్కన పేరుకుపోయింది. నిత్యం శుభ్రం చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో చెత్త ఎక్కువ మొత్తంలో పేరుకుపోయింది. దీంతో విధికుక్కలు వచ్చి మరింత అపరిశుభ్రంగా చేస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. వీలైనంత త్వరగా చెత్తను క్లియర్ చేయాలని కోరుతున్నారు.