పాతబస్తీలో ఎక్కడ చూసిన చెత్త కుప్పలు దర్శనం ఇస్తున్నాయి. ఇంటింటికి చెత్త ఆటోలు వస్తున్న సరే జనం మాత్రం బహిరంగ ప్రదేశాలలో చెత్తను వేస్తున్నారు. చార్మినార్ పరిధిలోని ఓల్డ్ ఖబూతర్ ఖానా మీడ్ ఆసుపత్రి ఎదుట ఈ చెత్త కుప్ప దర్శనం ఇచ్చింది. ఈ చెత్త వల్ల దుర్వాసన వస్తోందని, దోమల వ్యాప్తి కూడా పెరిగిందని, అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.