దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ పోటెత్తింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కిటకిటలాడాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లు ప్రయాణికుల రద్దీతో సందడి నెలకొంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలకు దీపావళి, ఛట్ పండుగలకు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే అన్ని రైళ్లు కిక్కిరిశాయి. దూర ప్రాంత రైళ్లతో పాటు, సాధారణ రైళ్లలోనూ రద్దీ నెలకొంది.