చార్మినార్: ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఫిర్యాదులు, వినతులు సమర్పించడానికి ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫిర్యాదులు, వినతులపై రిజిస్టార్ లేదా ఆపై ఉన్నతాధికారి పరిశీలించి, విచారణ చేసి, నిజనిర్దారణ చేసుకున్నాక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్ట్ ఆదేశించింది.