సీటీ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

77చూసినవారు
సిటీ పోలీస్ కమిషనరేట్ అధ్వర్యంలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాతబస్తీ లోని పేట్ల బురుజు హెడ్ క్వార్టర్స్ లో పోలీసుల కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగర సీపీ సీవి ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాసేపు దాండియా అడి ఉత్సాహపరిచారు. నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్