ఎమ్మెల్సీతో కలిసి మసీదును సందర్శించిన చార్మినార్ ఎమ్మెల్యే

84చూసినవారు
రానున్న ఉర్సు ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ అన్నారు. గురువారం ప్రముఖ జామియా నిజామీయా మసీదును ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బేగ్ తో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. మసీదులో మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్