కోఠీ మహిళ యూనివర్శిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టడం పట్ల యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఆవరణలోని దర్బార్ హాల్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ఫోటోలు పట్టుకుని పూలభిషేకం చేశారు.