సచివాలయంలో రైతు భరోసా విధి విధానాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్వర్యంలో గురువారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. కమిటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విధివిధానాలపై చర్చించనున్నారు.